తప్పుడు ప్రచారాన్ని ఖండించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఎండపల్లి, ఆగస్టు30: (కలం శ్రీ న్యూస్); కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మంత్రి హరీష్ రావు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం ఎండపల్లి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ,తెలంగాణలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలెందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాజుల విజయ్, గాజుల లక్ష్మణ్, సోంశెట్టి రమేష్రా,జారాంపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మాచెర్ల సంజీవ్, గెల్లు శ్రీనివాస్, వెంకటస్వామి గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.