అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
సుల్తానాబాద్,డిసెంబర్15(కలం శ్రీ న్యూస్):
నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ నీరుకుళ్ళ రోడ్డులో గల శ్రీ శ్రీ శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రస్తుతం అమెరికాలో నివాసముంటున్న దేవులపల్లి దీప జనార్ధన్ దంపతులు ఆదివారం అయ్యప్ప దీక్షాపరులకు అన్న ప్రసాద వితరణ చేసినారు.
ముందుగా గురుస్వామి మాటేటి శ్రీనివాస్ అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవులపల్లి దీప జనార్ధన్ దంపతుల స్నేహితుడు కొత్తూరి రమణా చారి గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవులపల్లి దీపా జనార్ధన్ దంపతుల తరపున వారి స్నేహితుడు కొత్తూరి రమణా చారి గురుస్వామిని అన్నదాన కమిటీ వారు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గురు స్వాములు మాటేటి శ్రీనివాస్, సుంక శ్రీధర్, లెక్కల గంగాధర్, టి.కే. తిరుపతి, తాండ్ర శ్రీధర్, అయ్యప్ప దీక్షాపరలు , మహిళలు పాల్గొన్నారు.