Saturday, November 9, 2024
Homeతెలంగాణగణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

 గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

సుల్తానాబాద్,సెప్టెంబర్15(కలం శ్రీ న్యూస్):

గణేశ్ నవరాత్రులు ముగించుకొని సుల్తానాబాద్ లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంచనియా సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., ఐజి తెలిపారు.ఆదివారం సుల్తానాబాద్ పట్టణ కేంద్రం లోని చెరువు  వద్ద నిమజ్జనం జరిగే ప్రదేశాలను, నిమజ్జన శోభాయాత్ర జరిగే రూట్ ను పోలీస్ కమీషనర్  పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఇతర ప్రభుత్వ శాఖ ల అధికారులతో కలిసి సందర్శించారు.

ఈ సందర్బంగా సీపీ  మాట్లాడుతూ నిమజ్జన సమయంలో పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసు పికెట్లు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు, ప్లడ్ లైట్లు, క్రేన్లు,మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల అందుబాటులో ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరిగింది అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఉంటుందన్నారు. నిమజ్జన శోభాయాత్ర రూట్, ట్రాఫిక్ డైవర్షన్ల కి సంభదించిన రూట్ మ్యాప్ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటిసారిగా నిమజ్జన శోభాయాత్ర కు సంబంధించి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించడం జరుగుతుందని, ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడినా లేదా శోభాయాత్రలో వాహనాల మూమెంట్ ను పర్యవేక్షణ చేయడం జరుగుతుందనీ, గణేష్ ఉత్సవ కమిటీలు త్వరితగతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని, ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చిన్న పిల్లలు మహిళలు శోభ యాత్ర లో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని అలాగే ట్రాక్టర్ల, లారీల పై, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని, కాళ్లు చేతులు క్రిందకు వేలాడేస్తూ ప్రయాణం సాగించవద్దని, పొరపాటున కాలుజారి పడిపోతే ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. నిమజ్జనం సమయంలో క్రేన్ సహాయంతో నిమజ్జనం చేసే సమయంలో యువత, చిన్నారులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని, సహాయకులు అందుబాటులో ఉండాలని అన్నారు.నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ అనిల్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బా రెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్,  ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!