ఐపీఎస్ పాఠశాలలో మట్టి వినాయకుల విగ్రహాల వితరణ
సుల్తానాబాద్, సెప్టెంబర్-06 (కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ పట్టణంలోని ఐపీఎస్ పాఠశాల ఆవరణలో విద్యార్థులచే స్వయంగా మట్టి వినాయక ప్రతిమలను తయారు చేయించి, తల్లిదండ్రులకు వితరణ చేశారు. విద్యార్థులు వినాయక ప్రతిమలను తయారు చేసి, రంగులద్ది చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియలు విద్యార్థులు ప్రతిమలు తయారు చేసే నైపుణ్యాన్ని చూసి వారిని అభినందించారు. విద్యార్థులు మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ మాట్లాడుతూ, రసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసే విగ్రహాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని, విద్యార్థులకు విద్యార్థి దశ నుండే సమాజం పట్ల అవగాహన కల్పిస్తే, భవిష్యత్తులో వారే రూపకర్తలుగా వ్యవహరిస్తారని, ఐపీఎస్ పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.