లయన్స్ క్లబ్ చే వ్యాయామ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
సుల్తానాబాద్,ఆగస్టు29(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని మున్సిపల్ పరిధిలోని స్థానిక సుగ్లాంపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలలో మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు క్లబ్ సభ్యులచే జ్ఞాపికలను అందజేసి శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కో-ఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్ధం జాతీయ క్రీడా దినోత్సవంను ప్రతిఏటా ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జరుపుకుంటారని,హాకీ క్రీడ ద్వారా వరుసగా మూడు ఒలింపిక్ స్వర్ణ పథకాలను సాధించి భారత్ పేరును విశ్వవ్యాప్తంగా మార్మోగించడంతో పాటు 400 పైగా గోల్స్ సాధించి ఎంతోమంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచి క్రీడలను క్రీడాభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారని తెలిపారు. 2012 లో మొదలైన ఈ క్రీడా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలుపుతూ ఆరోగ్య పరిరక్షణ, యువతను క్రీడా మార్గంలో నడిచేటట్లు ప్రోత్సహించడం, జాతీయ సమైక్యత పెంపొందించడంతో పాటు క్రీడల వలన శారీరక మానసిక వికాసానికి తోడ్పడుతాయని ఓర్పు, సహనం, ఏకాగ్రత ఏదైనా సాధించాలనే తపన ఇవన్నీ ఆటల వల్లనే అలవాడతాయని తెలిపారు. దేశంలో అత్యుత్తమ క్రీడాకారులను భారత ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య వంటి అవార్డులతో సత్కరిస్తారని అందువలన విద్యార్థులంతా క్రీడలను ధైనందిన జీవితంలో భాగం చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజాన్ని దేశానికి అందించాలని కోరారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ షో రెడ్డి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్ జిల్లా చీఫ్ కో-ఆర్డినేటర్ వలస నీలయ్య, పిట్టల వెంకటేశం, పూసాల సాంబమూర్తి, రాయల్ల నవీన్, పూసాల రామకృష్ణ, పల్ల అనిల్ కుమార్, తూర్పాటి భార్గవ్ కృష్ణ, ఆడేపు సదానందం, దాసరి ప్రసాద్, నాగమల్ల ప్రశాంత్, చకిలం వెంకటేశ్వర్లు పాఠశాల ప్రిన్సిపల్ షో రెడ్డి, ఉపాధ్యాయ బృందంతో పాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.