Tuesday, September 17, 2024
Homeతెలంగాణమత్స్య కార్మికులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్

మత్స్య కార్మికులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్

మత్స్య కార్మికులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్

మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి

మంథని,జులై26(కలం శ్రీ న్యూస్):

నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి అన్నారు.ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రభుత్వం ఏర్పాటులో మత్స్య కార్మికులు తమ వంతు సహకారం అందించిన విషయం మరువరాదని,ఈ శాఖలో ముదిరాజ్ లు బెస్త, ఎస్సీ, ఎస్టీ మొదలయిన అన్ని బలహీనవర్గాల కులాలు ఉన్నందున ప్రభుత్వంలో మత్స్యశాఖ అతి కీలకమైన కూడా మా మత్స్యశాఖ కు నిధులు కేటాయించక పోవడం శోచనీయం.ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే.అంతేకాకుండా నూతన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయిన ఇప్పటి వరకు చేప పిల్లల పంపిణీ ఊసే లేదు.గత ప్రభుత్వం మత్స్య శాఖకు నిధులు కేటాయించడమే కాక కార్మికుల జీవనోపాధికి అనేక ప్రజా పథకాలను( వెహికిల్స్, ఎక్సల్ బైక్స్ పడవలు, వలలు, ఐస్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజ్ బాక్సులు, రక్షణ వలయాలు) ప్రవేశపెట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వంలో మత్స్యకార్మికులు ఎన్నో ఆశలతో బడ్జెట్ లో నిధులు కేటాయించి కొత్త పథకాలు ప్రవేశపెడుతారని కలలు కన్న కార్మికుల ఆశల్లో నీళ్ళు చల్లుతూ నిరాశపరచడమే కాకుండా ప్రతి సంవత్సరం జరిగే చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పటి వరకు చేయక పోవడం ఈ ప్రభుత్వం మత్స్యకార్మికులను చిన్న చూపు చూస్తుంది అనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని అన్నారు.సరైన సమయం లో చేప పిల్లల పంపిణీ చేయకపోతే రాష్ట్రంలోని మత్స్యకార్మికుల కుటుంబాలన్ని దిక్కుతోచక రోడ్డున పడే ప్రమాదం ఉన్నందున మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే మత్స్య కార్మికుల కుటుంబాలను దృష్టి లో పెట్టుకొని మత్స్యశాఖకు నిధులు కేటాయించే విధంగా చొరవ చూపి రాష్ట్రంలోని మత్స్య కార్మికులను ఆదుకొవాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!