తమపై ఆరోపణ చేయడం సరికాదు
దుగ్యాల సంతోష్ రావు
సుల్తానాబాద్,జులై22(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన కీసా సంతోష్ అనే వ్యక్తి సోమవారం రాత్రి కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకొని తాగుతున్న వీడియోను చిత్రీకరిస్తూ తమపై ఆరోపణ చేయడం సరికాదని వైన్ షాప్ యజమాని దుగ్యాల సంతోష్ రావు అన్నారు. మంగళవారం పాత్రికేయ సమావేశంలో దుగ్యాల సంతోష్ రావు మాట్లాడుతూ గత ఆరు నెలల కిందట తమ వైన్ షాప్ లో లిక్కర్ ను తీసుకువెళ్లి అమౌంటు ఇవ్వక ఇబ్బందుల గురి చేస్తున్నాడని, అమౌంట్ అడిగితే వైన్ షాప్ సిబ్బంది పైన దురుసుగా మాట్లాడుతున్నాడని, మేము తనపై ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని, గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ అనుమతులతో న్యాయపరంగా మద్యం దుకాణాలను నడుపుతున్నామని, నాతో పాటుగా మా సిబ్బంది పైన ఇలాంటి దుష్ప్రచారం చేయడం అర్థరహితమని మాపై ఆరోపణ చేసిన కీస సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.