ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు…..
సుల్తానాబాద్, జూలై 21(కలం శ్రీ న్యూస్):
గౌడ కులస్తుల ఆరాధ్య దైవ మైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు సుల్తానాబాద్ పట్టణంలో ఆదివారం గౌడ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు పాల్గొన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలను పురస్కరించుకొని మహిళలు భక్తిశ్రద్ధలతో బోనం ఎత్తుకొని వీధి వీధిన డప్పు చప్పుళ్ళతో, బైండ్ల వారి విన్యాసాలతో,శివ సత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఎల్లమ్మ ఆలయం వరకు తరలి వెళ్లారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ నాయకులు మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత అన్నయ్య గౌడ్, మంద శ్రీనివాస్ గౌడ్, గడ్డం అంజయ్య గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, మంద మల్లయ్య గౌడ్,అంతటి లచ్చయ్య గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్, పోడేటి వెంకటేష్ గౌడ్, సంతోష్ గౌడ్, కొయ్యడ ఎల్లయ్య గౌడ్,మంద మధుకర్ గౌడ్,ఆనపురం శ్రీనివాస్ గౌడ్,కెక్కెర్ల శ్రీనివాస్ గౌడ్,బత్తిని కృష్ణ గౌడ్,మంద నాగార్జున గౌడ్, మంద శివ గౌడ్,అంతటి చిరంజీవి, బైరగోని ప్రభాకర్ గౌడ్ తో పాటు అధిక సంఖ్యలో గౌడ సంఘ నాయ కులు,యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.