సుల్తానాబాద్ కోర్టు ఏజిపి గా ఆవుల లక్ష్మి రాజం
సుల్తానాబాద్,జులై9(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా సుల్తానాబాద్ కు చెందిన సీనియర్ న్యాయవాది ఆవుల లక్ష్మిరాజం ను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఆవుల లక్ష్మీరాజం కృతజ్ఞతలు తెలిపారు. ఆవుల లక్ష్మీరాజం నియామకం పట్ల సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ కార్యవర్గం హర్షం వ్యక్తం చేశారు.