లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు
సుల్తానాబాద్,జూలై 01(కలం శ్రీ న్యూస్):
లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులకు,సిబ్బందికి జ్ఞాపికలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ మాటేటి సంజీవ్ కుమార్,వలస నీలయ్య మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని, అలాగే వైద్యరంగంలో భారతదేశం సాధిస్తున్న గొప్ప ప్రగతిని రోగుల కోసం నిరంతరం కృషి చేస్తున్న వైద్యుల పట్ల నమ్మకాన్ని వారి సేవల యొక్క అత్యుత్తమ స్వరూపాన్ని గౌరవించాలనే సదుద్దేశంతో క్లబ్ సభ్యులందరి తరపున వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ వైద్యుల యొక్క సేవలను గుర్తిస్తూ లయన్స్ క్లబ్ వారు సన్మానం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా కో ఆర్డినేటర్లు మాటేటి శ్రీనివాస్, కార్యదర్శి పిట్టల వెంకటేష్, కోశాధికారి పూసాల సాంబమూర్తి సభ్యులు పల్ల అనిల్ కుమార్, చకిలం వెంకటేశ్వర్లు, నాగమల్ల ప్రశాంత్, పల్ల శరత్ కుమార్, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శ్రీధర్, రామ్మోహన్, తనూజ, వెంకటేష్, రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.