ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి.
అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్
సుల్తానాబాద్, మే 23(కలం శ్రీ న్యూస్):
జిల్లాలో ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసి, సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ధనలక్ష్మి రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి, గోదాం లను అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, వేగవంతంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. అదేవిధంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.
అనంతరం కాట్నపల్లి గ్రామంలోని ధనలక్ష్మి రైస్ మిల్లులో ధాన్యం దిగుమతి ప్రక్రియ, గోదాములను పరిశీలించి, ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి వెంట వెంటనే పూర్తి చేసుకోవాలని, రైస్ మిల్లుల వద్ద ఎటువంటి కోత విధించడానికి వీల్లేదని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, రైస్ మిల్లర్లు,రైతులు పాల్గొన్నారు.