కార్మికుల పక్షాన నిలిచిన చరిత్ర నాదే
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
మంథని,నవంబర్28(కలం శ్రీ న్యూస్):నాలుగేండ్లు ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే ఇటు సింగరేణి కార్మికులు, అటు భూనిర్వాసితుల పక్షాన నిలిచిన చరిత్ర తనేదనని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ అన్నారు. మంగళవారం సెంటనరీకాలనీ ఓసీపీ 2 మైన్‌లో కార్మికుల కలిసి తనను ఆశీర్వించాలని కోరారు. ఈ ప్రాంతంలోని బొగ్గు గని కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గొప్పగా ఆలోచన చేశారని, తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూర్చినట్లు చెప్పారు. అంతేకాకుండా సింగరేణి ఓసీ విస్తరణలో భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేశామన్నారు. సింగరేణిప్రబావిత గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పించామని, కార్మికుల పిల్లల భవష్యత్ కోసం ఆరాటపడుతున్నానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆదరించి ఆశీర్వదిస్తే ఐదేండ్లు అండగా నిలుస్తానని అన్నారు.