చిరుతల రామాయణం ప్రదర్శన కార్యక్రమం లో పాల్గొన్న బొద్దుల లక్ష్మణ్
పెద్దపల్లి,జనవరి29,(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శన కార్యక్రమానికి పోచమ్మ గుడి దగ్గర పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ సేవాదళం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జూలపల్లి జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్
ఈ సందర్భంగా జెడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ మాట్లాడుతూ పెద్దాపూర్ గ్రామంలో చిరుతల రామాయణం ప్రదర్శన కొరకు శిక్షణ తీసుకొని ప్రదర్శన చేయడం చాలా గొప్ప విషయం అని, ఇందులో పాల్గొనే సభ్యులను అభినందించారు. వీరికి శిక్షణ ఇస్తున్నటువంటి సత్తార్ బాయ్ ని అభినందించారు. అలాగే 7 వేల సంవత్సరాల క్రితం త్రేతా యుగంలో జరిగినటువంటి రామాయణంను భవిష్యత్ తరాలకు అందించడానికి వీరు చేస్తున్నటువంటి కృషిని అభినందించారు. శ్రీరాముడి నీ ఆదర్శంగా తీసుకొని మన జీవితం గడపాలని అన్నారు. రామాయణంలో తండ్రి మాట జవదాటని కొడుకుగా శ్రీరాముడు, భర్త తోడు వీడని సీతమ్మ తల్లి, రామలక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధం నేటికీ ఆదర్శప్రాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చాతల్ల కాంతయ్య, ఎంపిటిసిల ఫోరం మండలాధ్యక్షుడు దండే వెంకటేశ్వర్లు, సొల్లు శ్యామ్, కల్లేపల్లి లింగయ్య, కల్లేపల్లి అంజయ్య, స్వామి, లచ్చయ్య కాంతయ్య, రామాయణ ప్రదర్శనలో పాల్గొనే పాత్రధారులు, మహిళలు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.