Thursday, December 26, 2024
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే కీలక పాత్ర

మంథని,నవంబర్24(కలం శ్రీ న్యూస్):ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి మలి దశ ఉద్యమాల్లో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని, వారి ఉద్యమ స్పూర్తి మరువలేనిదని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు పొందిన యువకులు హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్‌ గెలుపు కోసం సెంటనరీ కాలనీలోని కోదండరామాలయం నుంచి మంథనిలోని గౌతమేశ్వరస్వామి ఆలయం వరకు చేపట్టిన పాదయాత్రను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడ సిరులు పండించే సింగరేణి సంస్థ ఉందని అన్నారు. సింగరేణి బిడ్డలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. అనేక ఏండ్లుగా ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయని అన్నారు. తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ఇక్కడి అభ్యర్థి పుట్ట మధూకర్‌ ని ఎమ్మెల్యేగా గెలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలనే మంచి ఆలోచనతో యువకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టమధూకర్‌ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి సమస్యలు తీసుకెళ్లవచ్చని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌  గెలుపు కోసం పని చేస్తామంటూ పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఆమె అన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!