బిజెపి కార్యకర్తల ఇంటింటి ప్రచారం
సుల్తానాబాద్,నవంబర్18(కలం శ్రీ న్యూస్ ):సుల్తానాబాద్ మున్సిపాలిటీ లోని 5వ వార్డ్ (బూత్ నంబర్ 204) బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి గజభింకర్ పవన్ అధ్వర్యంలో పెద్దపల్లి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ కుమార్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి దుగ్యాల ప్రదీప్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బిజెపి కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు రావుల రాజేందర్ పాల్గొని తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చేయబోయే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షులు కూకట్ల నాగరాజు, మండల అధ్యక్షులు వేల్పుల రాజన్న, సీనియర్ నాయకులు గన్నభోయిన రాజేందర్, శేకర్ మాస్టర్, ఉపాధ్యక్షులు ఎనగందుల సతీష్, ప్రధాన కార్యదర్శి గుడ్ల వెంకటేష్, జిల్లా బి.జె.వై.ఏం కార్యదర్శి బుర్ర సతీష్ గౌడ్, పట్టణ కార్యదర్శి పోచంపల్లి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.