Friday, January 3, 2025
Homeతెలంగాణచీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగ దీపావళి..

చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగ దీపావళి..

చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగ దీపావళి…

ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి.

సుల్తానాబాద్,నవంబర్10(కలం శ్రీ న్యూస్):చీకటిని పారద్రోలుతో జీవితాల్లో వెలుగులు నింపే పండుగ దీపావళి అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలను విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగ ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులు తీసుకువచ్చే గొప్ప పండుగను హిందూ సమాజంతో పాటు జైనులు సిక్కులు ఆరోగ్యాన్ని సంతోషాన్ని కోరుకుంటూ దీపావళి వేడుకలను జరుపుకుంటారని తెలిపారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, విద్యార్థులకు విద్యార్థి దశలోనే పండుగలు యొక్క విశిష్టతను తెలిపేందుకు వారితోనే సాంప్రదాయబద్ధంగా దీపావళి వేడుకల యొక్క ప్రాముఖ్యతను తెలిపామన్నారు. పండగ రోజు ధనలక్ష్మి అమ్మవారి పూజ, కేదారి వ్రతాలు, నోములు జరుపుకునే విధానాన్ని విద్యార్థులచే ప్రదర్శింపజేశామన్నారు.  అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దీపావళి నాటిక, నృత్యాలు పలువురిని ఆకర్షింప చేశాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!