కాంగ్రెస్ పార్టీ లో చేరిన బి.అర్.ఎస్ నాయకులు..
సుల్తానాబాద్, అక్టోబర్ 30(కలం శ్రీ న్యూస్):ఎలిగేడు మండలం, శివపల్లి గ్రామంలో విజ్జన్న నివాసంలో సోమవారం సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామానికి చెందిన బి.అర్.ఎస్ పార్టీ నాయకులు పురెళ్ల సంపత్ గౌడ్,పురెళ్ల శ్రీనివాస్ గౌడ్, పల్లెర్ల కుమార్ గౌడ్,తమ్మనవేణి మధునయ్య, కుమార్,ఏగోలపు రామూర్తి గౌడ్,రాజేశం గౌడ్,తమ్మనవేని రమేష్, పురెళ్ల రాజు గౌడ్,కొలిపాక రవి, కొట్టె అక్షయ్, సింగరపు సంపత్,ఎగొల్లపు మొండయ్య గౌడ్ లు పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ఉపాధ్యక్షులు చింతకుంట విజయరమణా రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.