Thursday, December 26, 2024
Homeతెలంగాణబీఎస్పీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు

బీఎస్పీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు

బీఎస్పీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు

పెద్దపల్లి,అక్టోబర్22(కలం శ్రీ న్యూస్):బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష  సమక్షంలో పెద్దపల్లి స్వగృహం నందు ఆదివారం వెన్నంపల్లి, రేగిడి మద్దికుంట, మియాపూర్, రాగినేడు, రాఘవపూర్, గ్రామల నుండి దాదాపు 150 మంది పైగ పార్టీలో చేరగా వారికి దాసరి ఉష  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

అనంతరం దాసరి ఉష  మాట్లాడుతూ వెన్నoపల్లి గ్రామం నుండి దొమ్మటి ప్రభాకర్ మాజీ వార్డ్ మెంబర్ పెరుక సoఘ జిల్లా ఉపాధ్యక్షులు, కలవేన రవీందర్ మాజీ వార్డ్ మెంబర్, ఈర్ల సదానందం మాజీ వార్డ్ మెంబర్, మిలుకుల సదానందం మాజీ వార్డు మెంబర్ , కూర్మ మధుకర్ వార్డ్ మెంబర్. రేగడి మద్దికుంట గ్రామం నుండి నల్లగొండ స్వామి గౌడ్ 2వ వార్డ్ మెంబర్ (బీఆర్ఎస్) వారితో పాటు వారి అనుచరులు, రాగినేడు గ్రామం నుండి ఎరవెళ్లి సురేందర్ రాజు తెలంగాణ మాల మహానాడు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు.మియాపూర్ రాఘవపూర్ గ్రామాల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన యువకులు నేడు పెద్ద ఎత్తున చేరినట్లు తెలిపారు, అదేవిధంగా పెద్దపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తగిన న్యాయం జరగక నేడు బీఎస్పీని పార్టీని పెద్దపల్లి ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని అన్నారు .

ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, పెద్దపల్లి అసెంబ్లీ మహిళా కన్వీనర్ అముధల అరుణ, అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్ ఉపాధ్యక్షులు కొల్లూరి నర్సయ్య, కోశాధికారి అల్లెపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!