లక్ష రూపాయల నగదు సీజ్….
సుల్తానాబాద్ ఎస్సై విజేందర్…
సుల్తానాబాద్, అక్టోబర్ 12(కలం శ్రీ న్యూస్):బ్లాక్ కలర్ సఫారీలో అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న ఒక లక్ష రూపాయలను పట్టుకున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై విజేందర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సుల్తానాబాద్ మండల శివారు దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, హైదరాబాదులోని బొల్లారం కు చెందిన కసిరెడ్డి ఉదయ్ కిరణ్ రెడ్డి తన బ్లాక్ కలర్ సఫారీలో కరీంనగర్ వైపు నుంచి పెద్దపల్లికి వెళ్తుండగా దుబ్బపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయగా అందులో అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా నిల్వ ఉంచిన లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజేందర్ తెలిపారు. ఎన్నికల నిబంధన మేరకు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నగదును తదుపరి విచారణ నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంచార్జ్ అనిల్ కు అప్పజెప్పడం జరిగిందన్నారు.