Thursday, December 26, 2024
Homeతెలంగాణమతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

మతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

మతి భ్రమించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు

విలేకరుల సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు

సుల్తానాబాద్ అక్టోబర్03( కలం శ్రీ న్యూస్):  పెద్దపల్లి నియోజక వర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి కంచు కోటలాంటి కార్యకర్తలు ఉన్నారని అందుకు నిదర్శనమే పెద్దపల్లి కేటీఆర్ సభ విజయవంతం అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, పారుపల్లి గుణపతి, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సభ విజయవంతం కావడంతో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు మతి భ్రమించిందని, రోజురోజుకు బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అర్థరహితపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి అంటేనే పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని, నియోజకవర్గంలో గతంలో జరగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాల కాలంలోనే ఎమ్మెల్యే చేసి చూపించారని, కేవలం ప్రెస్ మీట్లకు, రాస్తారోకో లకు, ధర్నాలకు పనికివచ్చే విజయ రమణారావు ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. నియోజకవర్గం లో గతంలో ఇక్కడి ప్రజలు రెండు సార్లు చీకొట్టిన తన వైఖరిలో మార్పు రాలేదని, ఎమ్మెల్యే పై అర్థరహితపు ఆరోపణలు చేస్తూ తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రపంచ దేశాలు గర్వించే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచి వేలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న డైనమిక్ లీడర్ తారక రామారావు అని, అలాంటి వ్యక్తిని విమర్శిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమి లేదని, అరిగిపోయిన రికార్డు లాగా ఊరికే అబద్ధాలు చెబుతూ గ్రామాలలో తిరగడం తప్ప ప్రజలకు చేసింది శూన్యమన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి జరిగిందో ప్రస్తుతం ఎమ్మెల్యేగా దాసరి మనోహర్ రెడ్డి ఎంత అభివృద్ధి చేశారో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వేలకోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణంతోపాటు మండల కేంద్రానికి వచ్చే విధంగా ప్రతి గ్రామాలను కలుపుతూ తారు రోడ్ల నిర్మాణం చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి అంటేనే ముందుగా గుర్తొచ్చేది దాసరి మనోహర్ రెడ్డి అని పేర్కొన్నారు. రెండుసార్లు ప్రజలు చీకొట్టి ఇంటికి పంపిన సిగ్గు రాకుండా తిరిగి ప్రజల వద్దకు రావడం ఆయన అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. మూడోసారి ఇంట్లో కూర్చో పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తిరిగి పెద్దపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ జండా ఎగురుతుందని దాసరి మనోహర్ రెడ్డికి 60 వేల పై మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. అనంతరం నియోజకవర్గంలో నేటి నుండి ఎమ్మెల్యే యాత్ర కొనసాగుతుందని చిన్న కాలువల గ్రామంలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై చిన్న కాలువల నుండి గ్రామదర్శిని యాత్ర మొదలవుతుందని, చిన్నబొంకూర్, మియాపూర్, సుద్దాల గ్రామాలలో కొనసాగుతుందని, మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర మౌనిక శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, కోట వీణ రాజమల్లారెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు క్యాదాసి చంద్రమౌళి, దీకొండ భూమేష్ కుమార్, బోయిని రాజ మల్లయ్య, సూర శ్యామ్, తిప్పారపు దయాకర్, శీలం శంకర్, మైలారం నారాయణ, కల్వల లావణ్య ,గుర్రాల శ్రీనివాస్, అనుమల బాపూరావు, పసెండ్ల సంపత్, రేవెల్లి తిరుపతి, గొట్టం మహేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!