ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27(కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తొలి ఉద్యమ కెరటం, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని పద్మశాలి సేవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐల రమేష్, ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని బుధవారం మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుండా మురళి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పూసాల రోడ్డు వద్ద కొండా లక్ష్మణ్ చిత్రపటానికి పలువురు పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం నిర్విరామ కృషి చేసి మంత్రి పదవిని సైతం వదిలేసి, రాష్ట్ర సాధనే లక్ష్యంగా ముందుకు సాగారని, మలిదశ ఉద్యమంలో జల దృశ్యంలో ఉన్న తన ఆస్తులను సైతం రాష్ట్ర సాధన కోసం అందించిన మహోన్నత వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వలస నీలయ్య, యువత రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెగడ చందు, జిల్లా అధ్యక్షులు మెరుగు యాదగిరి, పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి సామల రాజేంద్రప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు సామల హరికృష్ణ, తుమ్మ శంకరయ్య, కొండ సత్తయ్య, తుమ్మ రాములు, సుంక చంద్రయ్య, ఎలిగేటి రమేష్, కామని వెంకటరమణ, దూడం ఆంజనేయులు, సురేష్, రమణ, సుంక మహేష్ లతోపాటు పెద్ద సంఖ్యలో పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.