గణపతి నవరాత్రుల సందర్బంగా లయన్స్ క్లబ్ చే 400 మంది భక్తులకు అన్నవితరణ
సుల్తానాబాద్, సెప్టెంబర్ 20(కలం శ్రీ న్యూస్ ): లయన్స్ క్లబ్ అఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలోని గణేష్ నగర్ కాలనీ గణపతి మండప సన్నిధిలో అత్యంత భక్తి శ్రద్దలతో మహా గణపతికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించిన అనంతరం లయన్స్ క్లబ్ కోశాధికారి రాయేల్ల నవీన్ 400 మంది భక్తులకు అన్నవితరణ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో గణేష్ నగర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్/లయన్ మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, ఉపాధ్యక్షులు పిట్టల వెంకటేష్, పూర్వ అధ్యక్షులు కోడూరి సతీష్ కుమార్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.