Friday, December 27, 2024
Homeతెలంగాణబీజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

బీజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

బీజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 17 (కలం శ్రీ న్యూస్): బీజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు ఆదివారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ బిజెపి మండల కమిటీ , పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతకుముందు బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా బీజెపి పట్టణ అధ్యక్షుడు బూడిద తిరుపతి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వం మెడలు వంచి మరి విమోచన దినోత్సవం జరిపిస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం జరుపుతే ఏందీ జరపకపోతే ఏంది అదొక ఏజెండా నా అని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో అమరులైన అమరవీరులను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎద్దేవా చేశారని హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసి నిజాం నిరంకుషత్వ పాలనకు చరమగీతం పాడిన రోజు ఈరోజు 1948 సెప్టెంబర్ 17వ తేదీ ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని మరియు అంతకు ముందు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులైన రావి నారాయణరెడ్డి చాకలి ఐలమ్మ కాళోజి దొడ్డి కొమురయ్య ఇలా అనేకమంది ఉద్యమకారులు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఇండియన్ ఆర్మీ దళాలతో హైదరాబాద్ సంస్థానాన్ని 224 సంవత్సరాల పాటుగా ఏకచత్రాధిపత్యంగా ఏలినటువంటి నిజాం రజాకార్ల మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం చేసిన తదనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మితమై రజాకార్లను తరిమికొట్టిన వీర తెలంగాణ పోరాట యోధులను తలుచుకుంటూ ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి, మంథని అసెంబ్లీ కోకన్వీనర్ నాంపల్లి రమేష్, మండల ఇన్చార్జి తోట మధుకర్ ,బిజెపి సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్ , బోయిని నారాయణ,సబ్బని సంతోష్, మండల కోశాధికారి ఎల్కా సదానందం, మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి తోటపల్లి లక్ష్మణ్, బూత్ అధ్యక్షులు సాదుల తిరుపతి, కపిరం శేఖర్, బుడిదా విష్ణు,ఎలకుర్తి సురేష్, దేవుళ్ళ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!