రాజకీయ పార్టీ నేతలతో ఆర్డీవో సమావేశం
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని,సెప్టెంబర్ 13 (కలం శ్రీ న్యూస్ ):మంథని ఆర్డిఓ హనుమా నాయక్ మంథని నియోజకవర్గ స్థాయి రాజకీయ పార్టీ నేతలతో బుధవారం ఆర్డీవో కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గం లోని 288 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవెల్ ఏజెంట్లను ఒక్కొక్క బూత్ కు ఒక ఏజెంట్ ను పార్టీ నుండి నియమించాలని ఆయన ఆదేశించారు. ఈ నెల 19 లోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు రాజకీయ నేతలు సహకరించాలని, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే తమ దృష్టికి తేవాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్,కాంగ్రెస్,బిఎస్పి,సిపిఎం నాయకులు 10 మండలాలకు సంబంధించిన తాసిల్దార్లు పాల్గొన్నారు.