Sunday, December 22, 2024
Homeతెలంగాణమంథని 121 విద్యా వసంతోత్సవం విజయవంతం చేయండి

మంథని 121 విద్యా వసంతోత్సవం విజయవంతం చేయండి

మంథని 121 విద్యా వసంతోత్సవం విజయవంతం చేయండి

కొండేలా మారుతి  

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 11(కలం శ్రీ న్యూస్ ):మంథని 121 విద్యా వసంతాల వేడుకల ను విజయ వంతం చేయాలని కార్యక్రమ వ్యవహర్త కొండేల మారుతి పిలుపునిచ్చారు.స్వచ్ఛంద నిర్వహాక సంస్థ మంథని విద్యార్థి యువత కార్యాలయంలో సన్నహాక సమీక్ష సమావేశం జరిగింది మంథని పూర్వ విద్యార్థుల మండలి పూర్వ అధ్యక్షుల నేతృత్వంలో తగు ఏర్పాట్ల కై కార్యాచరణ క్రమం రూపోందిచారు.తాటి బుచ్చన్న గౌడ్ 1964-65 హైస్కూలు పోరెడ్డి వెంకట రెడ్డి 1974-75 జూనియర్ కళాశాల కొండేల మారుతి 1984-85 డిగ్రీ కళాశాల మంథని విద్యార్థి సంఘాల కు అధ్యక్షులు గా వ్యవహరించారు.ఈ మూడు దశాబ్దాల గమనంలో ఆనాటి విద్యార్థుల సమీకృతమ మేకంగా విభిన్న రంగాలలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించారు.సాహిత్యం సాంస్కృతిక క్రీడా రంగంలో నిలచిన వారితో తగు కార్యక్రమాలు రూపోందిచనున్నామన్నారు.అక్టోబర్ 29 ఆవిష్కరణ జరిగే అపూర్వ విశేష సంచిక నందు ప్రచురించెలా ఆర్టికల్స్ పంపాలని మారుతి కొరారు.ప్రస్తుత విద్యార్థుల కు భిన్న స్థాయిలలో వ్యాస రచన వక్ర్తృత్వ జనరల్ నాలెడ్జ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యా మహోత్సవం విజయవంతం లో అందరూ చేయూత నివ్వాలని విద్యార్థుల సంఘాల పూర్వ అధ్యక్షులు కొండేల మారుతి పోరెడ్డి వెంకట రెడ్డి తాటి బుచ్చన్న గౌడ్ లు కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!