బీజేపీ పార్టీ లో చేరిన యూత్ కాంగ్రెస్ నాయకులు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 23 (కలం శ్రీ న్యూస్ ):రామగిరి మండలం రత్నపూర్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో కొండూ లక్ష్మణ్ తో పాటు 20 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి అస్సాం ఎమ్మెల్యే సుశాంత్ కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన, యువత కి వారు చేస్తున్న కార్యక్రమలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను ఎప్పుడు కూడా పాటించుకోలేదు,యువత చేతిలోనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.యువత రాజకీయ లోకి రావాలి.ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమని మంత్రి శ్రీధర్ బాబు ఒక నియంతల అణిచివేశాడు,ఇంత మంది యువత కు ఉపాధి,ఉద్యోగ అవకాశలు కలిపించడం లేకపోయారు,రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక స్థానిక యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తాం అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు,యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.