Thursday, December 26, 2024
Homeతెలంగాణసర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.

మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్

సుల్తానాబాద్, ఆగస్టు 18(కలం శ్రీ న్యూస్):సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండల కేంద్రంలోని పాత జెండా సర్వాయి పాపన్న విగ్రహం వద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ హాజరై సర్వాయి పాపన్న ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ రాచరికాన్ని ఎదిరించి,ప్రజల స్వేచ్ఛ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. నేటి యువతకు పాపన్న జీవితం స్ఫూర్తి దాయకమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ ప్రతినిధులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, అంతటి అన్నయ్య గౌడ్, మంద శ్రీనివాస్ గౌడ్,పులి రమేష్ గౌడ్,వేగోలం అబ్బయ్య గౌడ్, బూర్గు రాజేశం గౌడ్, గీత కార్మిక సంఘం నాయకులు అంతటి లచ్చయ్య గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, గడ్డం అంజయ్య గౌడ్, మంద మల్లయ్య గౌడ్, కొయ్యడ రమేష్ గౌడ్, అంతటి లచ్చయ్య గౌడ్, మంద కిషన్ గౌడ్, పంతంగి శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ రమాకాంత్ గౌడ్, కొయ్యడ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!