సుందిళ్ళ( పార్వతి) బ్యారేజ్ ని సందర్శించిన ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బ్యారేజ్ ను సందర్శించిన ఎమ్మెల్యే
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 21(కలం శ్రీ న్యూస్): కాళేశ్వరం ప్రాజెక్ట్ తో మంథని ప్రాంత రైతులకు చాలా నష్టం.బ్యాక్ వాటర్ తో ఏలాంటి ముంపు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.ప్రజలను అప్రమత్తం చేయాలి.ఈ కాలేశ్వరం ప్రాజెక్టుతో మా నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.పార్వతి బ్యారేజ్ ను సందర్శించి అక్కడే సంబంధిత ఈ.ఈ, డి.ఈ లు, ఏ.ఈ లు తో, సంబంధిత అధికారాలతో మాట్లాడి బ్యారేజ్ కి సంబంధించి గేట్లు ఎత్తే సమయంలో ముందస్తు జాగ్రత్తగా ప్రజలకు తెలపాలని ముంపు ప్రాంతాల వారికి సమాచారం ఇవ్వాలని,వారికి తగు ఏర్పాట్ల కొరకు అధికారులకు తెలియజేయాలి అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు.బ్యాక్ వాటర్ వల్ల వ్యవసాయ భూములు ముంపుకు గురికాకుండా,నివసించే ఇళ్లలోనికి ప్రాంతాల్లో గాని నీరు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కాలేశ్వరం ప్రాజెక్టు అధికారలను కోరారు.గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటున్న గ్రామస్తులకు గాని వ్యవసాయదారును అప్రమత్తం చేయాలి.ఏలాంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.కడెం ప్రాజెక్టు లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసినందున,శ్రీపాద ఎల్లంపల్లి, రాళ్లవాగునుండి కూడా నీరు సుందిళ్ల బ్యారేజ్ కి చేరుతున్నందున వెంటనే గేట్లు ఎత్తాలని అధికారులకు తెలపడం జరిగింది,ఈ గేట్లు ఎత్తేటప్పుడు ముంపుకు గురయ్యే ప్రాంతాలను ప్రమాదం జరగకుండా,ముందస్తుగా రెవెన్యూ పోలీస్ అధికారులతో సమీక్ష చేసుకొని గ్రామస్తులందరిని అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులను కోరారు.గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.అర్ అండ్ బి ,గ్రామ పంచాయతీ రాజ్ అధికారులు రోడ్ల,కుంటలు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలి.వర్షాల వల్ల వ్యాదులు ప్రబలే అవకాశం ఉన్నందున అపరిశుభ్రం గా ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు.అన్ని చోట్ల బ్లీచింగ్ చేయాలని అధికారులకు తెలిపారు.వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
ప్రజలు విద్యుత్ స్తంభాలను ముట్టుకోవద్దని,వైర్ల కింద నిల్చోవద్దని,పాతబడిన ఇండ్లలో నివాసం ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. మంథని మండలం బెస్త పల్లి గ్రామాన్ని సందర్శించి గత సంవత్సరములో బెస్త పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లకు బ్యాక్ వాటర్ ద్వారా నీరు రావడం వల్ల పునరావాస కేంద్రాలకువెళ్లకుండా ఉండడంతో ఇప్పుడు పాత పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు తెలపడం జరిగిందని మీ గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని,ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులను కోరారు.