Friday, December 27, 2024
Homeతెలంగాణఅసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం

అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను సందర్శించిన బీజేపీ పార్టీ ప్రతినిధుల బృందం

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 20 (కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజు పల్లిలో అసంపూర్తిగా నిర్మితమై నిలిచిపోయిన 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బిజెపి పార్టీ ప్రతినిధుల బృందం గురువారం పరిశీలించి డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ పనుల నిలిపివేత పై సంబంధిత కాంట్రాక్టర్ మరియు సంబంధిత ఉన్నత అధికారులను వివరణ అడగడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ కూచిరాజు పల్లి లో సర్వే నంబర్ 165/2 రెండు ఎకరాల స్థల విస్తీర్ణంలో ముస్లిం మైనారిటీలకు దళితులకు 100 డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కొరకు 2018వ సంవత్సరంలో అప్పటి టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పుట్ట మధుకర్ ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయల అంచనా వ్యయంతో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ పనుల కొరకు శంకుస్థాపన చేసి ఐదు సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు ఆ డబుల్ బెడ్ రూమ్ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటాడు గొర్రు మేకలు కోళ్లు ఎక్కడ కట్టేస్తాం అంటూ అందరికీ డబుల్ బెడ్రూంలు కట్టిస్తా అని బూటకపు హామీ ఇచ్చాడని డబుల్ బెడ్ రూమ్ లకు నిధులు మంజూరు చేసినట్టే చేసి ఆ నిధులను వేరే పథకాలకు మళ్లించి డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోవడం జరిగిందని కూచిరాజు పల్లి లో 2009వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు సర్వే నంబర్ 165/2లో గల నాలుగు ఎకరాల 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని నివేషణ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న కూచిరాజు పల్లి గంగపురి బోయిన్ పేట్ లకు సంబంధించిన నిరుపేదలకు ఇందిరమ్మ మూడో విడత సమీకృత గృహ నిర్మాణాల కొరకు ఆ భూమిని మంజూరు చేస్తూ 43 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్క కుటుంబానికి ఉత్తర్వులు జారీ చేశారని అనంతరం గృహ నిర్మాణ సంస్థ ద్వారా నిరుపేదలకు ఇచ్చిన కాపీలను మీకు ఇల్లు కట్టిస్తామని మాయ మాటలు చెప్పి అలాట్మెంట్ ఇచ్చిన ఒరిజినల్ లెటర్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని అయినా కూడా అప్పటినుండి కూచిరాజుపల్లి గంగాపురి బోయిన్పేట లకు చెందిన ప్రజలు మాకు కేటాయించిన నివేషణ స్థలాలు మాకు ఇవ్వాలని అనేక పోరాటాలు చేశారని అయినా కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వాలు స్పందించలేదని ఇప్పుడున్న బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి ఆ భూమిని కొంతమంది కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని,ఈ ప్రయత్నాలను బిజెపి పార్టీ పక్షాన మేము అడ్డుకుంటామని ప్రభుత్వ నివేషణ స్థలాలను నిరుపేదలకు కేటాయించి గుంజుకున్న కాంగ్రెస్ ను నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు నిర్మించి సకాలంలో అందించకపోయిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని వారన్నారు.సర్వే నంబర్ 165/2లో ఖాళీగా ఉన్న 2ఎకరాల 12 గుంటలలో ఎస్సీ, బిసి లకు సమీకృత డబుల్ బెడ్ రూములు మరో వంద నిర్మించి ఇవ్వాలని లేనిచో బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్, బీజేపీ నియోజకవర్గ కోకన్వీనర్ నాంపల్లి రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బూడిద రాజు,బిజెపి సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్,కొండపాక సత్య ప్రకాష్,బుర్ర రాజు గౌడ్,సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!