సూరయ్యపల్లి జాతీయ మాల మహానాడు కమిటీ ఎన్నిక
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 10 (కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలో జాతీయ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నూకల బాణయ్య ఆదేశాల మేరకు మంథని మండల అధ్యక్షులు జంజర్ల రాజు ఆధ్వర్యంలో సూరయ్య పల్లి గ్రామ శాఖను సోమవారం మాల మహానాడు కమిటీ భవన్ ఆవరణలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సూరయ్యపల్లి జాతీయ మాల మహానాడు అధ్యక్షులుగా జంజర్ల మల్లేష్,గౌరవ అధ్యక్షులుగా ఆర్ల వెంకటి,జంజర్ల పోచంలు ఎన్నికైనారు.గౌరవ సలహాదారులుగా జంజర్ల లింగయ్య,ఉపాధ్యక్షులుగా జంజర్ల పెద్ద గట్టయ్య,జంజర్ల చిన్న గట్టయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆర్ల లింగయ్య,కార్యదర్శిగా జంజర్ల చిన్న మల్లయ్య, సహాయ కార్యదర్శులుగా జంజర్ల శంకర్,ఆర్ల నారాయణలు ఎన్నిక కాగా ప్రచార కార్యదర్శులుగా జంజర్ల రాజేందర్,నారామల్ల విజయ్,కోశాధికారిగా ఆర్ల కార్తిక్,కార్యవర్గసభ్యులుగా ఆర్ల సడువలి,ఎరుకల మల్లయ్య,నారామల్ల రాజకుమార్,జంజర్ల రమేష్,జంజర్ల లింగయ్య, ఆర్ల మారుతీ,ఆర్ల శంకర్, ఎరుకల శ్రీనివాస్,గడ్డం శంకర్ కొంగల గట్టయ్య,ఆర్ల భానుచందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.వీరి ఎన్నిక పట్ల జాతీయ మాల మహానాడు కార్యవర్గం తరపున శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు అప్పాల పోచమల్లయ్య,డివిజన్ సోషల్ మీడియా అధ్యక్షులు గోర్రంకల సురేష్,కమిటీ ఆర్గనైజింగ్ సభ్యులు ఆర్ల జ్ఞాని,ఎరుకల సురేష్,రావుల నాగేష్,విజయ్, తదితరులు పాల్గొన్నారు.