తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని జూలై 2( కలం శ్రీ న్యూస్):అమరుడిని స్మరించుకునేలా మంథనిలో విగ్రహ ఏర్పాటు ఈ నెల 4న విగ్రహ ఆవిష్కరణను విజయవంతం చేయాలేవిగ్రహావిష్కరణ కమిటి చైర్మన్ పర్శ బక్కయ్య.ఆనాడే తెలంగాణ కోసం సాయుధ పోరాటం చేసి తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య నిలిచారని విగ్రహవిష్కరణ కమిటి చైర్మన్ పర్శ బక్కయ్య పేర్కొన్నారు. ఆదివారం మంథనిలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు ఎంతో మంది పోరాటం చేశారని, అలాగే భూస్వాముల వ్యవస్థ, నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప మహనీయుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.తెలంగాణ సాయుధ పోరాటం తొలి అమరత్వం పొందిన దొడ్డి కొమురయ్య చరిత్రను చాటి చెప్పాలనే ఆలోచనతో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ గొప్పగా ఆలోచన చేసి ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన మంథని గడ్డపై పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా దొడ్డికొమురయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఈ నెల 4న విగ్రహాన్ని లాంచనంగా ఆవిష్కరించుకోవడం జరుగుతుందన్నారు. ఆనాడు పేద ప్రజలకు అన్యాయం జరుగకూడదని పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య విగ్రహ ఆవిష్కరణకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు రాజకీయాలకు అతీతంగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా పరిషత్ చైర్మన్‌లు పుట్ట మధూకర్, జక్కు శ్రీహర్షిణీ రాకేష్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో పాటు పలువురు హజరుకానున్నట్లు ఆయన తెలిపారు.నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన ఈసందర్బంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విగ్రహవిష్కరణ కమిటి సభ్యులు తగరం శంకర్‌లాల్, కనవేన శ్రీనివాస్. పిక్కల రాజయ్య, ఏట రవి, గొర్రెంకల సురేష్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.