శాత్రాజ్ పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో కలపవద్దు
మంథని, జూన్ 29(కలం శ్రీ న్యూస్ ):శాత్రాజ్ పల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో యధావిధిగా ఉంచాలని గతంలో మంత్రి ని, ముఖ్యమంత్రి ని కోరడం జరిగింది.శాత్రాజు పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో చేర్చుతూ ప్రభుత్వం ఇచ్చిన Go.Rt.No 193 గెజిట్ ను వెంటనే రద్దు చేయాలని, శాత్రాజు పల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో ఉండేలా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామనీ ఏఐసీసీ కార్యదర్శి,మంథని శాసన సభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లా, ముత్తారం మండలం పారుపల్లి గ్రామంలోని శాత్రాజ్ పల్లి గ్రామాన్ని భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో కలపడం కోసం వెలుబడిన Go.Rt.No 193 ను ఖండిస్తున్నామనీ,తెలంగాణ ప్రభుత్వం మా శాత్రాజుపల్లి గ్రామస్తుల ప్రజా ప్రతినిధుల రైతుల అభిప్రాయం మేరకు వెంటనే Go.Rt.No 193 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని,శాత్రాజుపల్లి గ్రామం బౌగోళిక స్థితి గతులను బట్టి గ్రామస్తులకు సంబంధించిన వ్యవసాయ భూములు గాని, బ్యాంక్ అకౌంట్స్ గాని, పెన్షన్స్ గాని ముత్తారం లోని వివిధ గ్రామాలతో అనుసంధానమై ఉన్నారు.వారికి నది మాత్రమె అడ్డు ఉన్నది తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ నదిపై వంతెన నిర్మిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నిర్మిస్తున్న ఓదేడు వంతెన వాళ్ళకు కూడా శాత్రాజ్ పల్లి గ్రామస్తులకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది.ఈ శాత్రాజ్ పల్లి గ్రామంలో పారుపల్లి, వెంకటేశ్వర్ల పల్లి, ఓడేడు, ముత్తారం తదితర గ్రామాలకు సంబంధించిన రైతుల పొలాలు ఉండటం వల్ల ఈ గ్రామంలోనే సాగు చేసుకుంటు నిరంతరం ముత్తారం మండలానికి వెళుతూ జీవనం కొనసాగిస్తున్నారు.ముత్తారం మండలంతో పోలిస్తే టేకుమట్ల మండలం ఈ గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది గతంలో శాత్రాజుపల్లి గ్రామాన్ని భూపాల్ పల్లిలో టేకుమట్ల మండలంలో కలపడానికి అభిప్రాయo తెలపడం కోసం ముఖ్యమంత్రి కి ,జిల్లా కలెక్టర్ కి 30 డిసెంబర్ 2021లో మా ప్రతిపాదనలను పంపడం జరిగింది, ఇందులో క్లియర్ గా శాత్రాజుపల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో ఉంచాలని, గ్రామంలోని ప్రజాప్రతినిధులను, రైతుల ప్రజల అభిప్రాయ ప్రకారం ప్రభుత్వానికి తెలపడం జరిగింది.ప్రభుత్వం వెంటనేGo.Rt.No 193 గెజిట్ ను వెంటనే రద్దు చేయాలని శాత్రాజుపల్లి గ్రామాన్ని ముత్తారం మండలంలో కొనసాగించేలా GO విడుదల చేయాలని ఏఐసీసీ కార్యదర్శి,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.