దేశ్ కీ నేత కేసిఆర్ పాటల సీడి 2023సాంగ్ లోగో ఆవిష్కరణ
మంథని జూన్ 3(కలం శ్రీ న్యూస్):తెలంగాణ ఆవిర్భావ దశబ్ది వేడుకల సందర్బంగా చెన్నూర్ నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసె దిశగా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో వెనుక బడిన చెన్నూర్ నియోజకవర్గంను రాష్ట్రం సీఎం కెసిఆర్ అండ దండతో ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నందున చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ పైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంకు చెందిన ప్రముఖ రచయిత గాయకుడు అంతర్జాతీయ అవార్డు గ్రహీత కాశిపేట సంతోష్ కుమార్ పాట రాసి పాడడం జరిగింది.ఈ యొక్క పాటలసీడీ కీ నిర్మాత దర్శకులుగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంకు చెందిన ప్రముఖ జాతీయ నాట్య రత్న అవార్డు గ్రహీత డాన్స్ కొరి్యోగ్రాఫర్ సింగర్ వడ్డాది శైలజ మధులు శనివారం క్యాతన్ పల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం దేశ్ కీ నేత కెసిఆర్ పాటల సీడీ 2023 సాంగ్ లోగో ఆవిష్కరించిన చెన్నూర్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు ఎంపీటీసీ లు జడ్పీటీసీలు పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.