ఉద్యమ కారుల సమస్యలు పరిష్కరించాలి
మంథని, జూన్ 1(కలం శ్రీ న్యూస్)::ఉద్యమ కారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమ కారుల మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి అన్నారు. గురువారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ మంథనిలో ఉద్యమ కారులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ కారుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని, వారికి అన్ని వర్గాలలో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో మహిళా నాయకురాళ్ళు కటకం వనజ రాణి, లలిత ఠాగూర్, ముస్క ఈశ్వరమ్మ, సునీత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.