నూతన రోడ్డు, మురికి కాలువ పనులకు శ్రీకారం. మున్సిపల్ చైర్ పర్సన్ సునీత ముత్యం రమేష్ గౌడ్.
సుల్తానాబాద్,మే17(కలం శ్రీ న్యూస్):గత కొన్ని ఏళ్లుగా ఆదరణకు నోచుకొని చెరువుకట్ట నుండి హనుమాన్ గుడి వరకు గల పాత జెండా రోడ్డు యొక్క విస్తరణ పనులు రూపాయలు ఒక కోటి 11 లక్షలతో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణం కొరకై టెండర్లు పూర్తి చేయడం జరిగింది.
ఇట్టి పనులకు సహకరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి, విస్తరణకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్,పాలక వర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్, కౌన్సిలర్లు పసిడ్ల మమత సంపత్, గాజుల లక్ష్మీ రాయమల్లు, MD నిశాత్ రఫీక్, బిరుదు సమతా కృష్ణ, పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి,కూకట్ల గోపన్న, గొట్టెం లక్ష్మీ మల్లయ్య, అరుణ బాబురావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.