Thursday, January 2, 2025
Homeతెలంగాణకన్న కూతుర్ని అతికిరాతంగా చంపిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలి

కన్న కూతుర్ని అతికిరాతంగా చంపిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలి

కన్న కూతుర్ని అతికిరాతంగా చంపిన రాక్షసుడిని కఠినంగా శిక్షించాలి

ప్రజాసంఘాల డిమాండ్

మంథని మే 11(కలం శ్రీ న్యూస్,):మంథని మండలం బట్టుపల్లి గ్రామంలో గురువారం గుండ్ల సదానందం అనే వ్యక్తి తన కన్న 10 సంవత్సరాల కూతుర్నే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి వేయడం జరిగింది. ఈ సంఘటన స్థలాన్ని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ల సందీప్, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొరేంకల సురేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి, అనంతరం గ్రామంలోని ప్రజలను అడిగి నిజా నిజాలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం మంథని పోస్టుమార్టం రూమ్ దగ్గర కూడా మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని కోల్పోయి అనాధ అయినటువంటి గుండ్ల అంజి ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్ల సదయ్య గత తొమ్మిది నెలల క్రితం తన భార్యను కోల్పోయినప్పటినుంచి మద్యానికి బానిసై మతిస్థిమితం కోల్పోయి ఈరోజు తన కన్న కూతురిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపి పొట్టన పెట్టుకోవడం హృదయ విధానకరమైన విషయమని అన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపు లు నిర్వహించడం వలన మద్యానికి బానిసై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అన్నారు. మంథని ప్రాంతంలో గ్రామాలలో బెల్ట్ షాపులను అరికట్టడంలో సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. దీనికి నిదర్శనమే ఇలాంటి సంఘటనలు అని అన్నారు. మద్యం మత్తులో యువత తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారని అన్నారు. కన్న కూతుర్ని చంపిన గుండ్ల సదయ్య అనే కిరాతకున్ని కఠినంగా శిక్షించి అందర్నీ కోల్పోయి అనాధ అయినటువంటి గుండ్ల సదయ్య కుమారుడు అంజిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!