Thursday, January 2, 2025
Homeతెలంగాణపదో తరగతి పరీక్ష ఫలితాలలో సెయింట్ మేరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి పరీక్ష ఫలితాలలో సెయింట్ మేరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

పదో తరగతి పరీక్ష ఫలితాలలో సెయింట్ మేరీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

10 జీపీఏ సాధించిన విద్యార్థిని రామిడి శ్రీహారిక

సుల్తానాబాద్,మే10(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సెంట్ మేరీ స్కూల్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ చాటారు. 10వ తరగతి 10జీపీఏ కు 10 జీపీఏ సాధించి విద్యార్థిని రామిడి శ్రీహారిక సత్తా చాటి ముందు వరుసలో నిలిచింది. 13 మందికి 9 పైన జీపీఏ సాధించారు. పాఠశాలలోని విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యారని పాఠశాల కరెస్పాండెంట్ ఫాదర్ తుమ్మ అశోక్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిదేందుకు నిరంతరం మా విద్యా సంస్థ లోని ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. మంచి విద్యా భోదన నైపుణ్యం కలిగిన బృందం చే విద్యార్థులకు బోధనను అందిస్తున్నామని అన్నారు. అందుకు గాను మంచి ఫలితాలను గత సంవత్త్సరాలలో కూడా అత్యధిక మార్కుకు సాధించి ముందువరుసలో నిలిచామని హర్షం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో 10వ తరగతిలో ఉతీర్ణత సాధించిన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ శుభాకంక్షాలు తెలిపారు. ఉతీర్ణత సాధించని విద్యార్థులను ఉదేశించి మాట్లాడుతూ పరీక్ష లను ఒక ఛాలంజ్ గ తీసుకోవాలని, ఓటమి గెలువుకు తోలి మెట్టు గా భావించి, ఓటమికి గల కారణాలను తెలుసుకొని ముందడుగు వేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!