Saturday, December 21, 2024
Homeతెలంగాణకార్మికులకు ఉచిత వైద్య శిబిరం

కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

-సహాయ కార్మిక శాఖ అధికారి హేమలత

మంథని మే 8(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరం నిర్వహించనున్నట్లు మంథని సహాయ కార్మిక శాఖ అధికారి ఎంకే హేమలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించనున్న ఈ శిబిరంలో తెలంగాణ భవన మరియు ఇతర సంక్షేమ మండల ద్వారా లేబర్ కార్డు ఉన్న కార్మికులకు సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా 50 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ హాజరై ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని ప్రారంభించనున్నారని ఆమె పేర్కొన్నారు మంథని మండలంలోని లేబర్ కార్డు కలిగిన కార్మికులు ఈ శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!