వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలే
జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్
మంథని, మే 7(కలం శ్రీ న్యూస్):భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న వైద్య శిభిరాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ ఫుట్ట మధూకర్ కోరారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహాలో హెల్త్ క్యాంపులకు సంబంధించిన కర పత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వైద్య శిభిరాలను ఏర్పాటుచేస్తుందన్నారు. ఉదయం 9 గంటలకు ఈనెల 8న కమాన్‌ఫూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాల, 9న మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదనంలో ఉచిత వైద్య శిభిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా మండలాల్లోని భవన నిర్మాణ కార్మికులు వైద్య శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్బంగా కోరారు.