తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా…
మంథని, మే 6(కలం శ్రీ న్యూస్):అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఏగ్లాస్ పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ సదానందం,పేరవెన లింగయ్య ఆధ్వర్యంలో రైతులు పెద్దఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమo చేపట్టారు. సుమారు గంటపాటు ఏగ్లాస్ పూర్ కాటారం ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం సర్పంచ్ సదానందం మంథని తాసిల్దార్ కు ఫోన్ ద్వారా సమాచారం తెలపడంతో వెంటనే తాసిల్దార్ ఆర్ ఐ ని సంఘటన స్థలానికి పంపించారు.ఆర్ఐ రైతులతో మాట్లాడుతూ తప్పనిసరిగా న్యాయం చేసే విధంగా సంబంధిత శాఖ అధికారులతో తాము మాట్లాడతామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. వెంటనే రైతులు ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..