పంచాయతీ కార్యదర్శుల కోరికలు నెరవేర్చి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి….
మంథని ఏప్రిల్ 28(కలం శ్రీ న్యూస్ ):పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన కోరికలు,హక్కులను నెరవేర్చి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మంథని మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వేణు గోపాల్ అన్నారు.శుక్రవారం మంథని ఎంపీడీవో కార్యాలయం ఆవరణ ముందు పంచాయతీ కార్యదర్శులు సమ్మె నిర్వహించారు.ఈ సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు సమ్మెలో పాల్గొనడం బాధాకరమని అప్పుడు వారికి ఇచ్చిన మాట రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రొబిషన్ వెంటనే డిక్లేర్ చేసి,సర్వీస్ కాలాన్ని కలిపి ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రకటించాలన్నారు.తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలపడంలో పంచాయతీ కార్యదర్శుల శ్రమ ఎంతో ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం అవార్డులు సాధించడంలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు ఎంతో ఉందన్నారు.వివిధ కేంద్ర ప్రభుత్వ అవార్డులు సాధించే విషయంలో తెలంగాణను మొదటి స్థానంలో ఉంచడంలో పంచాయతీ కార్యదర్శులు ఎంతో కష్టపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘo జనరల్ సెక్రెటరీ సాగర్ రావు, ఉపాధ్యక్షురాలు అమీన భాను,బిజెపి నాయకులు నాంపల్లి రమేష్,మల్లిక్ పటేల్,మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.