Sunday, December 22, 2024
Homeతెలంగాణరోడ్డు ప్రమాదాలు నివారించడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ :

రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ :

రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ :

ఆసిఫాబాద్,ఏప్రిల్ 27 ( కలం శ్రీ న్యూస్) :

జిల్లా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ 

రోడ్డు భద్రత- అవగాహణ గురించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ డి.జి.పి అంజని కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుండి ఎస్పీ కే సురేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ జిల్లా పోలీసు అధికారులకుపలుసూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, మొబైల్ ఉపయోగిస్తూ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ ప్రతిరోజు సాయంత్రం మరియు రాత్రి తప్పకుండా చేయాలని తెలిపారు.

జిల్లా ప్రజలకు ఎస్పీ పలుసూచనలు :

✓ రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి.

✓ రహదారుల పై వాహన దారులు ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ సైన్ బోర్డ్ ను గమనిస్తూ వెళ్ళాలి.

✓ వాహనదారులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు పరిమిత వేగంలో వెళ్లాలి.

✓ద్వి చక్ర వాహనా దారుడు హెల్మెట్ ధరించాలి.

✓కార్లలో ప్రయనిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి.

✓రహదారి పైకి వెళ్ళే సమయంలో, జాతీయ రహదారి క్రాస్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.

✓ చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వరాదు.

✓ ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలు ,రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ,పొల్యూషన్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి.

పై నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర రావు,అదనపు ఎస్పీ (ఎ.ఆర్) భీమ్ రావు, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, కాగాజ్ నగర్ డిఎస్పి కరుణాకర్, టాస్క్ఫోర్స్ సిఐ సుధాకర్, డి.సి.ఆర్.బి సి.ఐ పవన్ కుమార్, ఎం. టి ఆర్.ఐ శ్రీనివాస్,ఇతర పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!