మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తది
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని ఏప్రిల్ 22(కలం శ్రీ న్యూస్ ):నియోజకవర్గంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే ఆరాటపడుతున్నామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు.
శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని మున్సిపల్ పరిధి కుచిరాజ్ పల్లి లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రార్థనల అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి వారిని కలుసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంతంలోని ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసమే నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. మంథనితో పాటు నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీల వర్గాల సమస్యల పరిష్కారంతోపాటు వారికి అండగా నిలిచామన్నారు. మంథని మున్సిపల్ పరిధిలో అభివృధ్దిబాటలు పడ్డ ఉస్మాన్‌పుర ఇందుకు నిదర్శనమన్నారు.అనేక ఏండ్లుగా ఉస్మాన్‌పురవాసులు దుర్గంధంలో జీవించారని,ఎన్ని ఇబ్బందులు పడ్డా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ మున్సిపల్ చైర్ పర్సన్‌గా పుట్ట శైలజ ఉస్మార పుర వాసులు సైతం సమాజంలో గౌరవంగా బతుకాలని,వారు నివసించే వీధి ఉన్నతవర్గాలు ఉండేలా అందంగా ఉండాలని గొప్పగా ఆలోచన చేసి సుందరంగా తీర్చిదిద్ది అభివృధ్ది చేసి ఉస్మాన్‌పుర ముఖచిత్రమే మార్చిందన్నారు.గత పాలకులు మనల్ని ఓటు బ్యాంకుగానే చూసి సీట్ల కోసం ఆరాటపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ తాము ఏనాడు ఓట్ల కోసం సీట్ల కోసం అట్టడుగు వర్గాలను వాడుకోలేదని, తాము కిందస్థాయి నుంచే వచ్చిన వారమని, తాము వేసే ప్రతి అడుగు మీ అభివృధ్ది కోసమేనని గుర్తించాలన్నారు. పవిత్ర రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని, నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారని ఆయన కొనియాడారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని వర్గాల ప్రజలు రంజాన్ సందర్బంగా ముస్లింలను కలిసి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ ప్రజలందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.