ప్రధాని మోడీ, ఎంపీ బండి సంజయ్ ల దిష్టిబొమ్మలు దగ్ధం మంథని ఏప్రిల్ 5(కలం శ్రీ న్యూస్ ): బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ బండి సంజయ్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. బుధవారం మంథని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదవ తరగతి హిందీ పేపర్ లీకేజీ ఘటనపై బిజెపి నాయకులు చేస్తున్న వ్యవహారం పైన నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ, ఎంపీ బండి సంజయ్ ల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందీ పేపర్ లీకేజీ ఘటనలో బిజెపి నాయకుల హస్తం ఉన్నప్పటికీ, ఆ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందీ పేపర్ లీకేజీ ఘటనలో దోషులను గుర్తించి శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకుల పైన బిజెపి నాయకులు చౌకబారు విమర్శలు చేయకూడదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంథని మండల పార్టీ అధ్యక్షుడు ఏగొలపు శంకర్ గౌడ్ , పట్టణ అధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ, ఎంపీపీ కొండ శంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, రైతుబంధు సమితి అధ్యక్షుడు ఆకుల కిరణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, ఉప్పట్ల సర్పంచ్ బడికల నరసయ్య, సీనియర్ నాయకులు తగరం శంకర్ లాల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కపాక సంపత్, గొబ్బూరి వంశీ, నక్క శంకర్, కొట్టే రమేష్ , ఆసిఫ్ ఖాన్, ఆరిఫ్ ఖాన్, పొలు కనక రాజు, ఖలిల్, బూర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.