వ్యవసాయ బావి మోటర్ చోరీ
సుల్తానాబాద్, ఏప్రిల్2(కలం శ్రీ న్యూస్):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాల శివారులో ర్యాకల్ దేవుపల్లి రోడ్డులో ఉన్న వ్యవసాయ భూమిలో పొలం సాగు చేసుకుంటూ ఉండే రైతు చొప్పరి లక్ష్మీరాజం తన వ్యవసాయ బావి మోటార్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోడ్డు లో శనివారం రాత్రి మద్యం సేవించి మోటార్ స్టార్టర్ డబ్బా తాళం పగలగొట్టి ప్యూజులు తీసి, మోటర్ వైర్ కట్ చేసి 5 హెచ్ పి మోటారు సుమారు ఇరవై వేల రూపాయల విలువ గల మోటర్ చోరీకి గురి కావడం జరిగింది.కొంతమంది వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి గంజాయి,మద్యం తాగుతూ మోటార్లను దొంగతనం చేస్తున్నారు.దొంగతనం చేసిన వ్యక్తులను పట్టుకుని తగు న్యాయం చేయాలని రైతు ఆవేదన వ్యక్తంచేశారు.