టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుతో బిఆర్ఎస్ పతనం ఆరంభం.
బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 17(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ దోపిడీ కి అడ్డు అదుపు లేకుండా పోతుంది.గతంలో ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకున్నారు.ఇప్పుడు ఏళ్ల తరబడి నిరుద్యోగులు కష్టపడి చదివితే పేపర్ లీకేజీ చేసి వాళ్ళ ఆశలు పై నీళ్లు చల్లారు.ఈ పేపర్ లీకేజీ లో ఎవరి వాటా ఎంతో తెల్చాలి సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి.టీచర్స్ ఎమ్మెల్సీ లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించడం శుభాపరిణామం బి ఆర్ స్ పతనానికి నాంది గా బీజేపీ విజయం ఉపాధ్యాయుల సత్తా ఏమిటో కెసిఆర్ కి రుచి చూపించారు అన్నారు. అనంతరం అంబేద్కర్ గారి విగ్రహనికి పూల మాల వేసి బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నరు.
ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,త్ సశక్తి కరన్ అభియాన్ మంథని నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరు సతీష్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్..టిపి యూస్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సునీల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుగ్యాల శ్రీనివాస్ రావ్, సీనియర్ నాయకులు కొండపాక సత్యప్రకాష్, రాపర్తి సంతోష్, బోగోజు శ్రీనివాస్, రేపాక శంకర్ యువ నాయకులు పార్వతి విష్ణు, తదితరులు పాల్గొన్నారు.