పంచాయతీ కార్యదర్శి పైన జరిగిన దాడి ని ఖండిస్తూ నల్ల బ్యాడ్జి లతో నిరసన విధుల బహిష్కరణ
ఎలిగేడు,మార్చి16(కలం శ్రీ న్యూస్):ఎలిగేడు మండలం లోని రాములపల్లి పంచాయతీ కార్యదర్శి పైన గ్రామానికి చెందిన తీట్ల అజయ్ తండ్రి లచ్చయ్య అనే వ్యక్తి విధులలో ఉన్న పంచాయతీ కార్యదర్శి విధులను ఆటంక కలిగించి దురుసుగా ప్రవర్తించి దాడి చేయడం జరిగింది.దానికి నిరసనగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో మండల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది నల్ల బ్యాడ్జీ లతో నిరసన తెలిపి విధులను బహిష్కరించి ,మండల పంచాయతీ అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమం లో మండల పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.