జగిత్యాల తహశీల్దార్ చౌరస్తా లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేవైఎం నేతలు
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల మార్చి 16 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల జీవితాల ను నాశనం చెసేందుకే టీఎస్ఏసి లేకేజ్ జరిగిందని, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ను అక్రమంగా జైల్ కు పంపడాన్ని నిరశిస్తూ గురువారం రోజున జగిత్యాల తహశీల్దార్ చౌరస్తా లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేవైఎం నేతలు.
ఈ సందర్భంగా బీజేవైఎం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రెంటం జగదీశ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వనికి చేతకాక ఈ యెక్క లికేజ్ కి పాల్పడిందని వెంటనే TSPSC చైర్మన్ తొలగించాలని. ఎవరైతో లికెజ్ కి పాల్పడ్డారో వారిని వెంటనే అరెస్ట్ చెసి చట్ట పరమైన కేసులు నమోదు చేయాలని అదే విధంగా ఎలాగైతే ఉద్యమాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్లీ కొట్లడితే కానీ ఉద్యోగాలు వచ్చేటట్టు లేవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమక్షంలో నిరుద్యోగ యువత కి ఎం భరోసా ఇస్తాడో చెప్పాలి అని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ యువత కి న్యాయం చేయకుంటే BJYM రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలూ చేపడుతుంది అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అదనపు కార్యదర్శి మంచి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షులు మెరుగు ఉమేష్, కోశాధికారి రంజిత్ రెడ్డి, కార్యదర్శి సాడిగే మహేష్ , సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రుద్ర విఘ్నేష్, మండల అధ్యక్షులు రవితేజ, శ్రీనివాస్,ప్రమోద్, రాజు, వెంకటేష్ నాయకులు పాల్గొన్నారు.