Monday, January 6, 2025
Homeతెలంగాణసాగునీటి విషయం లో రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న మంత్రి కొప్పుల 

సాగునీటి విషయం లో రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న మంత్రి కొప్పుల 

సాగునీటి విషయం లో రైతులకు ఇచ్చిన మాట నిలుపుకున్న మంత్రి కొప్పుల 

జగిత్యాల,మార్చి 8 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండెడ, గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందించాలని భారాస పార్టీ నేత వ్యాల్ల రాంరెడ్డి ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ని కలిసి విజ్ఞప్తి చేశారు.

ఈ రైతుల సమస్య పై ENC వెంకటేశ్వర్ తో మాట్లాడి సాగునీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పైప్ లైన్ లలో ఉన్న చిన్న చిన్న మరమ్మత్తులు పూర్తి చేసి బుధవారం ముంజంపల్లి మారేడుపల్లి, ఉండేడ గ్రామాలకు గేట్ వాల్స్ ఓపెన్ చేసి ఈ ప్రాంత రైతులకు నీటిని విడుదల చేశారు. ఈ సాగునీరు విడుదల వలన మూడు గ్రామాలకు సాగు నీరు అందనుంది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!