Thursday, December 26, 2024
Homeతెలంగాణవాటర్ ఆపిల్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

వాటర్ ఆపిల్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

వాటర్ ఆపిల్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో
 జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో వాటర్ ఆపిల్ పాత్ర
షుగర్ వ్యాధి గ్రస్థులకు వాటర్ ఆపిల్ ఒక వరం 
మార్చి 3 కలం శ్రీ న్యూస్,
ఇన్నీ పోషకాలు ఉన్న వాటర్ ఆపిల్ ను తినడం వలన ఎర్ర రక్త కణాలు సంఖ్య పెరగడంతో పాటుగా, శరీరంలోని ఎముకలు,కీళ్లు బలంగా తయారవుతాయి.అలాగే కండరాల తిమ్మిరి కూడా తగ్గుతుంది. ఈ వాటర్ ఆపిల్ తినడానికి తియ్యగా ఉంటుంది కాబట్టి అందరు కూడా ఈ వాటర్ ఆపిల్ ను తినడానికి ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండ్లలో హైడ్రేటింగ్ గుణం ఉంటుంది. అలాగే నోట్లోవేసుకోగానో ఇట్టే కరిగిపోతుంది.ఈ వేసవి కాలంలో ఎండ వేడిమిని తట్టుకుని,దాహాన్ని తగ్గించడంలో వాటర్ యాపిల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో వాటర్ ఆపిల్ పాత్ర
ఈ పండులో ప్రొటీన్లు, డైటరీ ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఫలితంగా మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి మలబద్దకం,విరేచనాలు,జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తుంది. అలాగే ఈ పండు తినడం వలన శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్‌ కరిగిపోయి బరువు తగ్గుతారు. అలాగే షుగర్ వ్యాధి గ్రస్థులకు ఈ వాటర్ ఆపిల్ ఒక. మంచి మందు అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.
 షుగర్ వ్యాధి గ్రస్థులకు వాటర్ ఆపిల్ ఒక వరం 
ఎందుకంటే ఇందులో ఉండే “జాంబోసిన్ “అనే ఒక రకమైన ఆల్కలాయిడ్ పిండి పదార్ధాలను చెక్కరగా మార్చకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా రక్తంలో చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.!ఇంతే కాకుండా వాటర్ యాపిల్ లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి కావున క్యాన్సర్,రక్తపోటు,గుండె సంబంధిత వ్యాధులు, మెదడుకు సంబందించిన ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ముఖ్యంగా ఈ పండు క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది.చూసారు కదా వాటర్ ఆపిల్ తినడం వలన ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాటర్ ఆపిల్ ఎక్కడ కనిపించినాగాని వదలకండి.
RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!